తెలంగాణా సంచార ముస్లింల సమస్యలు పరిష్కరించేందుకు సహకరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి కోరారు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్. ఏ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదని ముఖ్యంగా పిల్లల చదువులకు ఉపయోగపడే కులధ్రువీకరణ పత్రాలు పొందడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని బీసీ ఈ కేటగిరీలో 14 తెగలు ఉంటె కేవలం 3 లేదా 4 తేగల పేరు మీదనే కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని మిగిలిన వారికి అందరికి షేక్ అని జారీ చేస్తున్నారని దీనివలన తమ కులాలు భవిష్యత్తులో ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గత బడ్జెట్లో మైనారిటీ లకు 2500కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు ప్రకటించారని కానీ ఏ ఒక్క మైనారిటీ కుటుంబానికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి రుణాలు కానీ, ఏ ఇతర లాభం కలగలేదని, కనీసం వచ్చే సంవత్సరం బడ్జెట్లో అయినా సరైన కేటాయింపులు జరిపి పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తమ తరఫున శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని శ్రీమతి కవితను కోరారు. ఇటీవల జరిగిన కులగణనలో బీసీ ముస్లింలు 10 శాతం పైగా ఉన్నారని ప్రకటించారని అభివృద్ధి ఫలాల్లో కూడా మాకు ఆ ప్రకారం వాటా ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మీ సమస్యలను అర్ధం చేసుకున్నానని శాసనమండలిలో మీ గొంతుక వినిపిస్తానని సంచార, బీసీ ముస్లింలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ నిచ్చారు. కార్యక్రమంలో సంచార ముస్లిం రాష్ట్ర యువ నాయకుడు మహమ్మద్ ఫారుఖ్, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ మదార్, సంచార ముస్లిం సంఘం నాయకులు మహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
