వైరా మండలం జింకలగూడెం సభ్యులకు గుర్తింపు కార్డుల అందజేత

0
204

ఖమ్మం జిల్లా వైరా మండలం జింకలగూడెం గ్రామంలో నివసించే చక్కిటకారే తెగ ముస్లింలు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘంలో సభ్యులుగా చేరగా నేడు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ సభ్యుల గుర్తింపు కార్డులను అందజేసిన అనంతరం తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల ప్రజల పిల్లలకు కనీసం కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితమే ముస్లిం పేదలకు 4% రిజర్వేషన్లు కల్పించినా కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వలన ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఇప్పటికైనా కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తమకు గుర్తింపునివ్వాలని, సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక స్వావలంబన ఏర్పాటుచేయాలని కోరారు. సంచార ముస్లిం తెగల వారు అత్యంత పేద వారని వారి కులవృత్తుల ద్వారా తగిన ఉపాధి లభించడం లేదని, కొన్ని తెగలవారు వివిధ ప్రభుత్వ చట్టాల వలన కులవృత్తులను కోల్పోయారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ద్వారా అయినా వారిని గుర్తించి వారికీ ప్రత్యామ్నాయ ఉపాధికి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా చక్కిటకారే తెగ ముస్లింలు రాళ్లు కొట్టి ఉపాధిని పొందుతుంటారని కానీ ఈ వృత్తిలో రాళ్ళూ కొట్టే క్రమంలో చిన్నచిన్న ముక్కలు ఎగిరి కళ్ళకు ప్రమాదాలు అవుతున్నాయని తలకు కూడా గాయాలు అవుతున్నాయని వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here