తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం పేరుతొ బీసీ ఈ ముస్లింలను మభ్యపెట్టి తన జేబులు నింపుకుంటు పేరు ముందు పఠాన్ పేరు చివర ఖాన్ పెట్టుకొని బీసీ ఈ ముస్లిం గా చలామణి అవుతున్న ఒక ద్రోహి, వంచకుడు, మేకవన్నె పులి గురించి ఇదివరకే ఇంక్విలాబ్ టీవీ ఒక కధనం ప్రజల ముందుకు తెచ్చింది. అయినా అమాయక ప్రజలు ఇంకా ఆ ద్రోహిని నమ్ముతూ వాడు ఇస్తున్న చిల్లర పైసల కోసం వాడి వెనక తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలంతా నా వెనకే ఉన్నారని చెప్పుకుంటూ లేత ఎమ్మెల్సీ వద్ద గప్పాలు కొట్టుకుంటూ గత నెలలో వక్ఫ్ బిల్లు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కొన్ని జిల్లాల్లోని కొందరు స్థానిక ముస్లిం బీసీ ఈ పెద్దలను ఏమార్చి కొంత చిల్లర వారి ముఖాన కొట్టి బైక్ ర్యాలీలు చేయించాడు. ర్యాలీ ఖర్చుల కోసం అంటూ లేత ఎమ్మెల్సీ వద్ద నుండి సొమ్ము తీసుకొని అందులో కూడా కొంత సొమ్ము నొక్కేసాడని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికి కొంతమంది అమాయకులు వాడిని నమ్ముతున్నారంటే అది వారి అమాయకత్వమా లేక వాడి తెలివితేటలా అనేది ఇక్కడ కాస్త విచక్షణా జ్ఞానం ఉన్న వారంతా ఆలోచించాల్సిన విషయం. బీసీ ఈ ముస్లింలకు మంచి చేద్దామని కస్టపడి పనిచేస్తున్న వారంతా ఇప్పటికైనా ఏకతాటిపై వచ్చి సరైన ప్రణాళికతో పనిచేయకపోతే ఇలాంటి దొంగలు జాతిని దోచుకుంటూనే ఉంటారు.
తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా సైదాఖాన్ డిసెంబర్ నెలలోనే రాజీనామా చేసిన తర్వాత అక్కడ సమావేశమైన సంఘ సభ్యులంతా ఏకగ్రీవంగా మహమ్మద్ యాఖుబ్ ను నూతన అధ్యక్షుడుగా ఎన్నుకున్న తర్వాత కూడా ఈ ద్రోహి సైదాఖాన్ సిగ్గులేకుండా ఇంకా తానె రాష్ట్ర అధ్యక్షుడుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇటీవల లోన్లు ఇవ్వండంటూ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ వద్దకు బండెడు ఆధార్ కార్డులు తీసుకెళ్ళగా ఆయన మీ సంఘంలో నుండి నిన్ను తొలగించమని, నువ్వు సంఘ అధ్యక్షుడవు కావంటూ సమాచారం వచ్చింది ముందు మీ సంఘంలో ఉన్న అభిప్రాయబేధాలు తొలగించుకొని రా అంటూ నిర్మొహమాటంగా తిప్పి పంపేశారు. ఇలా పలుచోట్ల అవమానాలు ఎదురవుతున్న సిగ్గులేకుండా ఇంకా తానె సంఘ అధ్యక్షుడినని చెప్పుకుంటూ తిరుగుతున్న ఇతని పట్ల సంఘం సభ్యులు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారో వారికే తెలియాలి. ఇతగాడు చేసిన రాజీనామా పత్రాన్ని జతచేసి సంఘంలోని 8మంది సభ్యులు రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఒక దరఖాస్తు చేస్తే కొన్ని రోజులలోనే సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పటుచేసుకోవచ్చు. ఎందుకు సంఘ సభ్యులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి భయపడుతున్నారా లేక ఇతని వెనక వెన్నుదన్నుగా ఉంటూ ఇతగాడి అక్రమ వ్యవహారాలు ప్రోత్సహిస్తున్న లేత ఎమ్మెల్సీ ని చూసి భయపడుతున్నారా.
దేశంలో, రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి నానాటికి దిగజారిపోతున్న, ముస్లింలపై దాడులు జరుగుతున్నా అది పట్టించుకోకుండా తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ జాతి ద్రోహిని డబ్బులతో కొని జాతి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న లేత ఎమ్మెల్సీ ఆడుతున్న నాటకంలో అమాయకులు బలిపశువులుగా మారుతున్నారన్నది మీకు తెలుస్తుందా. రాష్ట్రంలో ప్రతిజిల్లా తిరిగి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోటానికి ఈ అమ్ముడుపోయిన జాతిద్రోహి, మోసగాడికి ఇటీవల ఒక కారును కూడా బహుమతిగా ఇచ్చారు సదరు లేత ఎమ్మెల్సీ. ఇప్పటికైనా తెలుసుకోండి పిచ్చి సాయిబులు మిమ్మల్ని ఆ లేత ఎమ్మెల్సీకి తాకట్టు పెట్టి తన జేబులు నింపుకుంటున్న ఈ జాతి ద్రోహి నిజ స్వరూపాన్ని. ఈ రోజు చిల్లర పైసల కోసం ఆశపడి మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేయకండి. పొట్టకోస్తే అక్షరం ముక్క లేని ఈ నిషాని గాడిని నమ్మి మోసపోకండి. మీ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేని ఇలాంటి నమ్మక ద్రోహులను మోసగాళ్లను నమ్ముతూ వాడి జేబులు నింపుకునే కార్యక్రమానికి మీరు బలిపశువులుగా మారకండి. నల్గొండలో ఉండే ఒక తుర్క కాశ నాయకుడు ఇంకా ఎంతో మంది ఇప్పటికి ఇతగాడి ఉచ్చులో చిక్కుకొని వాడి వెనకాల తిరుగుతున్నారని తెలుస్తుంది. పేద ముస్లిం ప్రజానీకానికి మంచి చేయాలనుకునే మీలాంటి వారుకూడా ఇలాంటి ద్రోహులకు చేయూత ఇస్తున్నారంటే మీమీద ఉన్న గౌరవం పోతుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఈ ముస్లింలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చుడండి కొన్ని నెలల క్రితం అడుక్కుని తింటే తప్ప తినడానికి గతిలేదని బాహాటంగా చెప్పుకున్న ఎక్కడికి వచ్చిన లుంగీ కట్టుకొని ఒక సంచిలో బట్టలు పెట్టుకుని వచ్చే ఈ ఫకీర్ సైదాఖాన్ ఈ రోజు టిప్పుటాపు బట్టలు వేసుకొని కార్లలో తిరిగే స్థాయి వచ్చాడంటే మొత్తం బీసీ ఈ సంచార ముస్లిం సమాజాన్ని రాజకీయ నాయకుల కాళ్ల వద్ద తాకట్టుపెట్టకుండా ఇది జరగడం సాధ్యమా. ఆలోచించండి మీ వద్దకు వస్తే ఈ ప్రశ్నలు అడగండి. ఇప్పటి వరకు జాతి కోసం ఎం చేశాడో అడగండి. పైసలకు కక్కూరి పడకుండా జిల్లా స్థాయి సంచార ముస్లిం పెద్దలు కూడా కాస్త మనసు పెట్టి ఆలోచించండి వీడు ఇచ్చే చిల్లర పైసలతో మీ జీవితం గడవదు కదా మీ కష్టార్జితం మీదే కదా. రేపు అల్లహ్ కు ఏమని సమాధానం చెప్తారు. దొంగకు, ద్రోహికి సహకరించడం కూడా తప్పే కదా అటువంటిది జాతి మొత్తాన్ని రాజకీయ నాయకుల కాళ్ళ వద్ద తాకట్టుపెడుతున్న ఇలాంటి రాబందును ఏంచెయ్యాలో బాగా అలోచించి నిర్ణయం తీసుకోండి
