తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటింగా ఉన్న సంచార ముస్లింలను సంఘటితం చేసి ఇప్పటి వరకు అటు ప్రభుత్వం గాని అధికారులుగాని పట్టించుకోకుండా సీతకన్నేసిన అత్యంత పేదరికంలో ఉన్న సంచార ముస్లిం తెగల ప్రజలను జాగృతం చేసి ఆర్ధికంగా సామాజికంగా విద్యాఉపాధి పరంగా అభివృద్ధిలోకి తేవడానికి స్థాపించిన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార ముస్లిం తెగల ప్రజలను ఏకతాటిపైకి తేవడానికి వారి ఉనికిని ప్రభుత్వానికి తెలపడానికి తద్వారా వారికి ప్రభుత్వపరంగా అందాల్సిన సంక్షేమ పధకాలు, ఇతర సౌకర్యాలు అందేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గుర్తింపు కార్డు ప్రక్రియ సంచార ముస్లిం సమాజం అర్ధంచేసుకుని తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కమిటీ సభ్యుల గుర్తింపు కార్డులను తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి యాకుబ్ గారు హైదరాబాద్ నుండి ఖమ్మం కు వచ్చి ముదిగొండ మండల అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ప్రతినిధి మూస గారికి అందజేశారు. ఈ సందర్భముగా మహమ్మద్ యాకుబ్ గారు మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల ప్రజలంతా సంఘటితమైతేనే మన హక్కులను అధికారాలను సాధించుకోగలమని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వర్యంలో సంచార ముస్లిం తెగల యువతీ యువకులు ముందుకు వచ్చి ఈ బృహద్కార్యంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.