మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కమిటీని నియమించి ఐడీ కార్డులు అందజేసిన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం దంతాలపల్లి మండల అధ్యక్షుడుగా సయ్యద్ భోలేషా ప్రధాన కార్యదర్శిగా విద్యాధికుడు యువకుడు సయ్యద్ ముస్తఫా ను నియమించారు. ఈ సందర్భముగా తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల ప్రజల పిల్లలకు కనీసం కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లకు ముస్లిం పేదలకు 4% రిజర్వేషన్లు కల్పించినా కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వలన ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఇప్పటికైనా కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తమకు గుర్తింపునివ్వాలని, సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక స్వావలంబన ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో షేక్ గౌస్, షేక్ నాగులు, సయ్యద్ పాషా, తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం వరంగల్ రూరల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.