తెలంగాణ రాష్ట్రంలో నివసించే ముస్లింలలో బీసీ ఈ కేటగిరీలో వచ్చే 14 తెగలలో 5వ తెగ గా ప్రభుత్వం ప్రకటించిన వారే ఈ గారడీ ముస్లిం, గారడీ సాయిబులు, పాములవాళ్ళు, కనికట్టువాళ్ళు, గారడోల్లు, గారడిగ పేర్లతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతొ పిలవబడతారు. కాబట్టి మీరు మీ జిల్లాలలో మండలాలలో మీ గ్రామాలలో నివసించే మీ సోదరులు గారడీ ముస్లిం, గారడీ సాయిబులు, పాములవాళ్ళు, కనికట్టువాళ్ళు, గారడోల్లు, గారడిగ కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఏమైనా అడ్డంకులు ఏర్పడితే ఈ వార్త చూపించి ఇందులో పొందుపరచిన కులధ్రువీకరణ పత్రం చూపించి మీరు మీ కులధ్రువీకరణ పత్రం పొందగలరు. ఒకవేళ మీకు అప్పటికి కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి ప్రభుత్వాధికారులు నిరాకరించినట్లైతే మన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ 7989035050, రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాకుబ్ 7093101022, లను సంప్రదించండి. మీ సమస్య పరిష్కారంలో వారు మీకు సహాయపడతారు.