ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు గ్రామంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం సభ్యులకు సంఘ గుర్తింపు కార్డులు ఈ ప్రాంత బాధ్యుడు మహమ్మద్ జలీల్ కు అందజేసిన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్. ఈ సందర్భముగా తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల ప్రజల పిల్లలకు కనీసం కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితమే ముస్లిం పేదలకు 4% రిజర్వేషన్లు కల్పించినా కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వలన ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఇప్పటికైనా కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తమకు గుర్తింపునివ్వాలని, సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక స్వావలంబన ఏర్పాటుచేయాలని కోరారు. బుగ్గపాడు గ్రామంలో నివసించే అచ్చుకట్ల, ఖురేషి తెగల వారు అత్యంత పేద వారని వారి కులవృత్తుల ద్వారా తగిన ఉపాధి లభించడం లేదని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ద్వారా అయినా వారిని గుర్తించి వారికీ ప్రత్యామ్నాయ ఉపాధికి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
