ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల సంచార ముస్లిం తెగల సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేత

0
154

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘంలో సభ్యులను జేర్పించే మహత్తర బాధ్యతను అలుపెరగక నిర్వహిస్తున్న మహమ్మద్ మునీర్ భాయ్. ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలలో 200మందికి పైగా సంఘ గుర్తింపు కార్డులు చేయించారు మహమ్మద్ మునీర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంచార తెగల ముస్లింల బతుకులు మారాలంటే వారి హక్కులను వారికి అందేలా జేయాలంటే వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని భావించి దేశంలో ఏ కులసంఘం ఇప్పటి వరకు చేయని గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించి గత సంవత్సరకాలంగా సంచార ముస్లిం తెగల ముస్లింల వివరాలు సేకరిస్తూ ఆర్ధిక, శారీరక, మానసిక వత్తిడులు ఎదురైనా అలుపెరుగక శ్రమిస్తున్న సంచార ముస్లిం తెగల యోధుడు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్. మంగళవారం మహమ్మద్ మునీర్ అల్లుడికి తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం బుధరావు పేట,తట్టుపల్లె, తదితర గ్రామాల సభ్యుల గుర్తింపు కార్డులను అందజేసిన అనంతరం తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల ప్రజల పిల్లలకు కనీసం కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితమే ముస్లిం పేదలకు 4% రిజర్వేషన్లు కల్పించినా కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వలన ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఇప్పటికైనా కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తమకు గుర్తింపునివ్వాలని, సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక స్వావలంబన ఏర్పాటుచేయాలని కోరారు. సంచార ముస్లిం తెగల వారు అత్యంత పేద వారని వారి కులవృత్తుల ద్వారా తగిన ఉపాధి లభించడం లేదని, కొన్ని తెగలవారు వివిధ ప్రభుత్వ చట్టాల వలన కులవృత్తులను కోల్పోయారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ద్వారా అయినా వారిని గుర్తించి వారికీ ప్రత్యామ్నాయ ఉపాధికి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here